మీ మొదటి పేరు నింపండి:

మీరు ఇక్కడ ఉన్నారు {{ personName }}

… మీరు వెదుకుతున్న సందేశం!

జీవితంలో అతి ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ పేజీలో మీరు కనుగొంటారు. "భూమ్మీద నా జీవిత పరమార్థం ఏమిటి?" "ఇతరులలో నేను చూసే శాంతి నాకు ఎందుకు లేదు?" లేదా, “జీవితం ఇంతేనా?” వగైరా ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు మరియు ఇతరమైనవాటికి సమాధానాలు ఈ పేజీ మీకు తెలియజేస్తుంది. మీరు దానిని గ్రహించకపోవచ్చు, కానీ మీరు మీ సృష్టికర్త అయిన దేవుని నుండి వేరు చేయబడ్డారు. నిజానికి, మీరు మీ స్వభావంతో వేరు చేయబడ్డారు. దేవుడు మిమ్మును ప్రేమిస్తున్నాడు గనుక మిమ్మల్ని తనతో సమాధానపరచుకోవాలని, మిమ్మల్ని మరల తనవద్దకు చేర్చుకోవాలని కోరుకుంటున్నాడనే నిరీక్షణను మీకందించడమే మా సందేశం. మీ ఎడబాటు నిత్యమైనది కాదని దేవుని పరిష్కారం మీకు నిశ్చయత కలిగిస్తుంది.

{{ personName }}, ఈ పరిష్కారాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోగోరుతున్నారా?

మీరు:

  • మీ జీవిత ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోగోరుతున్నారా?
  • గతంలో చేసినవాటి విషయంలో క్షమాపణ పొంది దాని ద్వారా కలిగే సంతోషం, ఉపశమశం యొక్క అనుభూతి పొందాలనుకుంటున్నారా?
  • భూమిమీద ఈ జీవితం కంటె గొప్పది ఉందని, మరియు పరలోకంలో నిత్యజీవం గురించిన నిశ్చయతను పొందగోరుతున్నారా?

మూలసూత్రం: విశ్వాసం అనే తాళపు చెవి మాత్రమే వీటి గురించి మరియు ఇతర అనేక సంగతులను గురించి తెలిపే ద్వారాన్ని తెరుస్తుంది.

"ప్రపంచం" అనగా నా లాంటి మరియు మీ {{ personName }}, లాంటి వ్యక్తుల పట్ల దేవుని ప్రేమ, మన కోసం ఈ పరిష్కారాన్ని అందించడానికి కారణమయింది. తద్వారా మీరు అతనితో సమాధానపడడం వల్ల అతని ప్రేమను మరియు శాంతిని అనుభవించవచ్చు.

దేవుడు {{ personName }} ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

బైబిల్‌ వాక్యభాగం: యోహాను 3:16

దేవుని ప్రణాళికను కనుగొనడం: సమాధానము, జీవము

ఇక్కడ, ఇప్పుడు మీరు సమృద్ధికరమైన జీవమును పొందాలని దేవుని ఉద్దేశం. మరి, సమృద్ధికరమైన జీవితాన్ని అనేకులు ఎందుకు ఆస్వాదించలేకపోతున్నారు? యోహాను 10:10

stap1

సమస్య: దేవునికి మరియు {{ personName }} కు మధ్య ఒక విభజన ఉంది.

పాపము మిమ్మల్ని దేవునినుండి వేరు చేసింది. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా 59:1-2 మీకు దేవునికి మధ్య విభజనకు కారణమిదే. ఆదాము చేసిన పాపం మనందరికీ సంక్రమించడం ద్వారా {{ personName }}, మీరు కూడా పాపములో జన్మించి, పాపములోనే కొనసాగుతున్నారు. అందునుబట్టి మీకు దేవునికి మధ్య విభజన ఏర్పడింది.

{{ personName }}

దేవుడు

stap2

దేవుని సహవాసం మనం ఆనందంతో అనుభవిస్తూ, ఆయనకు మహిమ కలుగజేయాలని, దేవునితో మైత్రి కలిగివుండాలని దేవుడు మనలను తన స్వరూపమందు సృజించాడు. మనం ఆనందంగా అనుభవించాలని దేవుడు మనకోసం ఒక అందమైన లోకాన్ని సృజించాడు. అద్భుతమైన, సంపూర్ణమైన జీవితం జీవించగలిగే ఒక అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు.

దేవుడు మనలను రోబోలవలె కాక, తన స్వరూపమందు సృజించి, మనం స్వేచ్ఛతో ఆయనను ప్రేమించాలని, ఆయనకు విధేయులమై, ఆయన మనకు అందించిన సమస్తాన్ని ఆనందంగా అనుభవించాలని కోరుతున్నాడు. దేవునికి అవిధేయులం కావాలో లేక ఆయనను ప్రేమించాలో నిర్ణయించుకునే అవకాశం ఈ స్వేచ్ఛ మనకు కలిగిస్తుంది. మెట్టుకు నిజమైన స్నేహం, నిజమైన ప్రేమ కలిగివుండాలంటే, మనకు ఎంచుకునే స్వేచ్ఛ అవసరం. రోబోలను నిర్ధేశించేలాగ కాక, స్నేహానికి, ప్రేమకు పునాది ఎంచుకోవడం వల్ల కలుగుతుంది.

అయితే, మొదట సృజించబడిన నరుడు, తన మార్గాన్ని తానే ఎంచుకొని, పాపమనే అవిధేయతకు లోనయ్యాడు. పాపమంటే నిర్దేశించిన లక్ష్యాన్ని లేక గమ్యాన్ని కోల్పోవడమే. ఎందుకంటే మనమెంతో శ్రేష్ఠంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. పాపమువలన కలిగిన పర్యవసానం మొదటి మానవుడైన ఆదాముకు, మొదటి స్త్రీయైన హవ్వకు మాత్రమే కాదు కాని పాపస్వభావం సర్వమానవాళికి సంక్రమించింది కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది.

బైబిలు ఇలా చెబుతోంది:

ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. రోమా 5:12

లక్ష్యంనుండి తప్పిపోవడం వలన, మనం దేవునినుండి వేరుచేయబడ్డాం; మన అనుబంధం విచ్ఛిన్నమైంది. తత్ఫలితంగా సరిదిద్దలేని ఎడబాటు కలిగింది. ఇలాంటి ప్రయత్నాలు మనమెన్ని చేసినా:

  • మతాచారాలు, పారంపర్యాలు
  • ఉన్నత నైతిక ప్రమాణాలు
  • ధ్యానం
  • మానవ ప్రయత్నాలు
  • పరోపకారం
stap3

మరనేకమైన మార్గాలు. దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులము కనుక మనమెన్ని ప్రయత్నాలు చేసినా, మనమధ్య అంతరం తొలగదు, మన పాపాలు తీసివేయబడవు, కనుక మన లక్ష్యం చేరలేము.

బైబిల్ చెబుతుంది: "ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు." రోమా 3:23

"ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము." రోమా 6:23

ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారముంది!

దేవుని పరిష్కారం: యేసుక్రీస్తు

{{ personName }}

దేవుడు

stap4

యేసుక్రీస్తు

మనలను దేవునికి దూరం చేసిన పాపానికి పరిష్కారం తానే అందించాలని దేవునికి తెలుసు. దీనికి పరిష్కారం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మన మధ్యకు ఒక మానవుడిగా రావడమే. ఎవరూ చేయలేనిదానిని యేసు చేయులాగున, ఆయన పరిపూర్ణమైన పాపరహిత జీవితం జీవించి, మన పాపమువలన కలిగే శిక్షను తాను భరించడానికి సిద్ధపడి, మన స్థానంలో తానే దానిని భరించాడు.

ఒకరితో ఒకరు కలిగివున్న అనుబంధంలో క్రీస్తుయేసుకున్న మనస్సు మీరు కూడ కలిగివుండాలి:

ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని. మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను. ఫిలిప్పీయులకు 2:5-8

మన పాపముల కొరకు మరణించడంద్వారా, దేవునికి మనకు కలిగిన అంతరానికి యేసు వారధి కట్టాడు.

బైబిలు ఇలా చెబుతోంది:

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. రోమా 5:8

వాస్తవానికి యేసు దానిని ఇలా చెప్పాడు: ''నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.'' యోహాను 14:6

చివరగా, దేవుడే ఒక పరిష్కారంతో వచ్చాడు. దేవుడు సశరీరుడై, యేసుక్రీస్తు అను వ్యక్తిగా వచ్చి, దేవునికి మనకు మధ్యనున్న అంతరానికి ఒక వారధిని నిర్మించాడు. అందునిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడు; ఆయన సిలువలో ఘోరమరణాన్ని పొంది, మన స్థానంలో మన పాపముల కొరకైన శిక్షను భరించాడు. ఇలా చేయడంద్వారా దేవునికి మనకు మధ్యనున్న అంతరానికి యేసు వారధిని నిర్మించాడు.

బైబిలు ఇలా చెబుతోంది:

అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. రోమా 5:8

దానికి కొంచెం ముందుగా:

యేసు – "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు." యోహాను 14:6

{{ personName }}

దేవుడు

  • అసంతోషం
  • ఎడబాటు
  • అపరాధభావం
  • అనిశ్చితి
  • లక్ష్యం లేకపోవడం
  • శ్రమ, ఆందోళన
  • సంతోషం
  • సహవాసం, అనుబంధం
  • క్షమాపణ
  • నిత్యజీవము
  • సమృద్ధికరమైన జీవితం
  • శాంతి
stap5

యేసుక్రీస్తు

{{ personName }} మీరిప్పుడు చూస్తున్నట్లుగా, పాపము వలన ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు పుట్టుకతోనే దేవునికి దూరమయ్యారు. {{ personName }}, మీరూ, మీతోపాటు ప్రతి ఒక్కరు అపరాధములో పట్టబడి, నిత్యశిక్షకు లోనయ్యారు. మీకూ, తక్కిన వారికీ, ఇది జరుగకూడదని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన మీపట్ల దీర్ఘశాంతం కలిగివున్నాడు. మీలో ఎవరూ నశింపక, ప్రతి ఒక్కరు మారుమనస్సు కలిగినవారై నిత్యజీవం పొందాలని ఆయన కోరుతున్నాడు. అలా మీరు చేయనట్లయితే, మీరు దేవునికి దూరంగానే ఉంటారు. మీరు జీవమును కోరుకోవాలని దేవుడు ఇప్పుడే మీవద్దకు వస్తున్నాడు; మీరు నిజంగా ఆయన బిడ్డగా మారాలని, ఆయన మీకు తండ్రిగా ఉండాలని ఆయన మీకొక అవకాశం కల్పిస్తున్నాడు. బాప్తీసము వంటి మతపరమైన ఆచారాల ద్వారా లేక మతపరమైన కొన్ని నిబంధనలద్వారా లేక సత్క్రియలద్వారా మీరు దేవునితో సమాధానపరచబడలేరు. యేసును ఎంచుకోవడమంటె, దేవుని ఎంచుకోవడం. ఇదే విశ్వాసం. ఇది దేవుని కృపవలన సాధ్యం. ఇంతకు మించిన ప్రాముఖ్యమైన నిర్ణయం మరేదీ ఉండదు. ఆయనను, ఆయన సందేశాన్ని విశ్వసించడంద్వారా మీరు ఆయన బిడ్డగా మారగలరు.

బైబిలు ఇలా చెబుతోంది:

తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను 1:12

ఆయనను, ఆయన తన జీవిత, మరణ, పునరుత్థానాలద్వారా సాధించిన వాటి సత్యాన్ని విశ్వసించడమే దైవ సందేశమని బైబిల్‌ చెబుతోంది.

బైబిలు ఇలా చెబుతోంది:

అదేమనగా–యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రోమా 10:9-10

ఇలా చేసినప్పుడు మీరు పాపక్షమాపణ పొందుతారు. మీరిప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము పొందుతారు. 'విశ్వాసం కలిగివుండడం', 'యేసునందు నమ్మికయుంచడం' అంటే ఇదే. దీనిని మీరు {{ personName }}, వ్యక్తిగతంగా చెయ్యాలి. ఆయన సందేశాన్ని అంగీకరించాలి. యేసును అంగీకరించడమే ఈ సత్యం. అప్పుడు యేసు మీ జీవితానికి ప్రభువుగా ఉంటాడు.

{{ personName }}, మీరేమి ఎంచుకుంటారు?

stap6

బైబిలు ఇలా చెబుతోంది:

'తన్ను (యేసును) ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన (నామమందు) విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.'' యోహాను 1:12

{{ personName }}, మీరిలా చేస్తారా:

1. మీరు పాపియని, దేవునినుండి మీరు వేరు చేయబడ్డారని మీరు గుర్తించారా?

2. దేవునివద్దకు రావాలంటే, మీరు యేసునందు విశ్వాసముంచి, ఆయనయందు నమ్మికయుంచాలని మీరు గ్రహించారా?

3. మీ పాపముల విషయమైన శిక్షను ఆయన భరించాడు కనుక మిమ్మును క్షమించుమని మీరు యేసును వేడుకుంటారా?

4. ఆయన ప్రభువని, మృతులలోనుండి తిరిగి లేచాడని మీరు విశ్వసిస్తున్నారా?

ఈ ప్రశ్నలకు మీరు {{ personName }}, అవును అని జవాబు చెప్పినట్లయితే, ప్రార్థనలో దానిని చెప్పండి, ఎందుకంటే మీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు.

యేసు రక్తము, ఆయన బలియాగమునుబట్టి మీ పాపములు కడిగి వేయబడినందుకు మీరిప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలరు.

5. మీరిప్పుడు 'నూతన సృష్టి' 2 కొరింథీ 5:16-17 అని బైబిల్‌ చెబుతోంది కనుక మీ భావిజీవితమంతా ఆయనను అనుసరిస్తానని మీరు దేవునికి చెప్పవలసిన సమయమిది.

మీరు దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఈ క్రింది సంగతులను మీరు చెప్పగలరు:

ప్రభువైన దేవా, నేను పాపినని, నీ క్షమాపణ నాకు అవసరమని నేను గ్రహించాను. యేసుక్రీస్తు నా కొరకు మరణించి, మృతులలోనుండి తిరిగి లేచాడని నేను గ్రహించాను. నా పాత జీవిత మార్గాన్ని విడిచి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసుక్రీస్తు నా హృదయంలోకి, నా జీవితంలోకి ఇప్పుడు వస్తాడని నేను ప్రార్థిస్తున్నాను: తద్వారా నేను నిన్ను నా తండ్రిగా కలుసుకొని, నీ గురించి మరియెక్కువగా నేర్చుకోగలను. నీ సహాయంతో, నిన్ను నా జీవితంలో ప్రభువుగా చేసుకొని, నీకు విధేయుడనై నిన్ను అనుసరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమేన్‌